తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు.. మరో 51 మంది మృతి..!

Saturday, May 1st, 2021, 03:12:05 PM IST

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 77,930 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,754 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,360కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 3,62,160 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 78,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 6,542 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 51 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,312 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,29,83,784 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 81.68 శాతం ఉండగా, మరణాల రేటు 0.52% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.