కరోనా అప్డేట్: ఏపీ లో మరో 8,096 కేసులు…67 మరణాలు!

Friday, September 18th, 2020, 06:00:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 74,710 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 8,096 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,06,663 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 67 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో, మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5,244 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,803 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య5,16,196 కి చేరింది.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 84,423 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ బు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, మెరుగైన వైద్య చికిత్స అందించడం జరుగుతుంది.