బిగ్ న్యూస్: ఏపీ లో మరో 8,835 కరోనా కేసులు

Wednesday, September 16th, 2020, 06:59:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 75,013 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 8,835 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,89,865 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 64 మంది కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,105 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు ఏపీ లో కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 10,845 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,94,481 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 90,279 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.