తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు…మరో నలుగురు మృతి!

Monday, October 19th, 2020, 08:48:42 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి నీ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్పాలి.భారీ కేసులు నమోదు కాకుండా, కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 26,027 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 948 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,23,059 కి చేరింది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాలతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య తెలంగాణ లో 1,275 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,896 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,00,686 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 21,098 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.