బ్రేకింగ్: ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Sunday, September 13th, 2020, 07:30:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. భారీగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 72,233 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 9,536 పాజిటివ్ గా తేలాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,64,228 కి చేరింది.

అయితే అదే తరహా లో గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 66 మంది ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ ఈ వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 4,912 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 10,131 మంది కోలుకోగా, ఇప్పటి వరకూ ఈ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,64,244 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 95,072 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.