తెలంగాణలో మరో 965 కేసులు…5 మరణాలు

Friday, April 2nd, 2021, 09:45:30 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 59,343 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 965 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,09,741 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుండా ఇంకా దీని తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,706 కి చేరింది. నిన్న ఒక్క రోజే 312 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 3,01,876 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 6,159 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.