మెట్రోలో మరొక ప్రమాదంలో – భయాందోళనలో ప్రయాణికులు

Friday, October 18th, 2019, 11:42:06 PM IST

హైదరాబాద్ చరిత్రని మరొక మెట్టు పైకి ఎక్కించిన ఘనత మెట్రో ది. కానీ ప్రస్తుతానికి ఈ మెట్రోలో ప్రయాణం అంటేనే ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎంట్రో ప్రారంభం అయినా కొత్తలో అందరు కూడా మెట్రోపై ఎంతో ఇష్టాన్ని కనబరిచినప్పటికీ కూడా ఇప్పుడు మెట్రో అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం మెట్రోలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటమే. కాగా గత 2 నెలల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముందుగా ఎంట్రో ట్రైన్ లో ఒక పాము కనిపించి, అది అందరిని భయపెట్టి సంచలనాలను సృష్టించింది. ఆతరువాత వర్ష కారణంగా మెట్రో కింద తలదాచుకున్న ఒక యువత్రి పై మెట్రో గోడ పెచ్చులు పడి మృతి చెందింది.

కాగా తాజాగా మరొక ఘటన జరిగింది. శుక్రవారం నాడు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్తున్నటువంటి ఒక మెట్రో లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ వద్ద మెట్రోలో కంపార్టుమెంటు దాని డోర్ పై ఊడి పడింది. కానీ అదృష్టం ఏంటంటే… ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు. కాగా రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ కార్మికులతో పటు క్యాబ్ డ్రైవర్లుకూడా సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో చేసేదేమి లేక ప్రయాణికులందరూ కూడా మెట్రో న బాగా వాడుతున్నారు. కానీ వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో అందరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో అర్థంకావడం లేదు.