తెలంగాణ లో మరొక దారుణం – పోలీసులమని చెప్పి చివరికి…?

Wednesday, February 12th, 2020, 12:28:37 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అండగా ఎన్ని ప్రత్యేకమైన కొత్త కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ కూడా మహిళలపై ఇంకా ఈ దారుణాలు ఆగడమే లేదు. రాష్ట్రంలోని మహిళలపై అసభ్య ప్రవర్తనలు, అత్యాచార ఘటనలు ఎప్పటికి పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలోని మృగాలు మారిన దాఖలాలు ఎక్కడా చెప్పాలి. కాగా తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒక దారుణమైన ఘటన జరిగింది. కాగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళపై, ముగ్గురు యువకులు తాము పోలీసులమని బెదిరించి, అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ దారుణమైన ఘటనపై బాధితురాలు జహీరాబాద్ మొదటి పట్టణ పొలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కాగా సూర్యాపేటకు చెందిన 37 ఏళ్ల మహిళ తన కుమారుడితో కలిసి ఇటీవల కర్ణాటకలోని బీదర్ కి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి, బెదిరించి లగేజీ బ్యాగ్‌లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని, తనిఖీ చేయాలంటూ తల్లీకొడుకులను బస్సు నుంచి కిందకు దింపేసి, ఆ మహిళా బాగులని పరిశీలిస్తూ, ఆ మహిళా కుమారుడిని తమ వద్దే ఉంచుకొని, ఆ మహిళను ఒక పాడుబడ్డ భవనం లోకి తీసుకెళ్లారు. అక్కడితో ఆగకుండా ఈ విషయాన్నీ ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడినుండి పారిపోయారు. ఈ ఘటన నుండి తేరుకున్న ఆ మహిళా జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.