జనసేనానిని శాశ్వతంగా తొక్కడానికి మరో కుట్ర రాజుకుంటుందా?

Tuesday, June 4th, 2019, 12:31:59 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే ఎన్నో కుట్రలు,నిందలు మనం చూసేసాము.వాటన్నిటినీ తప్పని నిరూపిస్తునే పవన్ నిలదొక్కుకున్నా సరే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా తొక్కడానికి విశ్వ ప్రయత్నాలే చేసారు.అదొక్కటే కాకుండా పవన్ పోటీ చేసిన రెండు చోట్ల నుంచి వందలాది కోట్ల రూపాయలు కుమ్మరించి మొత్తానికి జనసేనాని అడుగు అసెంబ్లీలో పెట్టనివ్వకుండా చేసేసారు.

ఇప్పటికే గట్టి దెబ్బ తిని ఉన్న పవన్ వల్ల రేపు రానున్న రోజుల్లో ఎప్పటికైనా నష్టమే అనుకున్నారో ఏమో ఇప్పుడు పవన్ పై సరికొత్త కుట్రకు తెరలేపారు.మొన్నటివరకు ఒక పార్టీకి అను”కుల” మీడియాగా వ్యహరించిన వారు పవన్ పై పనిగట్టుకొని విష ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఇప్పుడు మాత్రం జగన్ మీడియా పవన్ పై విష ప్రచారం చెయ్యడం మొదలు పెట్టిందని జనసేన శ్రేణులు అంటున్నారు.

పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని ఎన్ని సార్లు చెప్పినా వీరికి అర్ధం కావడం లేదని,రాజకీయంగా శాశ్వతంగా పవన్ ను తొక్కడానికి కుట్ర పూరితంగా వారి ఛానెల్ మరియు పత్రికల్లో పవన్ పై విష ప్రచారం చేసి రాష్ట్ర ప్రజల్లోకి పవన్ ఇక రాజకీయాలు వదిలేస్తున్నారు అనే ఒక కోణాన్ని వీరే క్రియేట్ చేసి ఏదోలా అడ్డుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.మరి రానున్న రోజుల్లో పవన్ ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.