బిగ్ బ్రేకింగ్ : మరోసారి గాజువాకలో పవన్ కు దిమ్మతిరిగే షాక్.!

Wednesday, November 13th, 2019, 06:02:48 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు జనసేన పార్టీ అధినేత పవన్ వర్సెస్ టోటల్ వైసీపీగా మారిపోయాయి.ఇప్పుడు ఈ యుద్ధం అంతా వైసీపీ మరియు జనసేన పార్టీల మధ్యనా అన్నట్టుగా మారిపోయింది.తెలుగు భాష విషయంలో రెండు పార్టీలు ఏకీభవించకుండా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయి ఆరోపణలు చేసుకుంటున్నారు.తాజాగా ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

పవన్ వ్యక్తిగత జీవితాన్ని ఎత్తి మరోసారి కామెంట్స్ చేసేసరికి సోషల్ మీడియాలో రెండు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు.అయితే నిన్న జగన్ అన్న మాటలకు పవన్ కౌంటర్ ఇస్తూ తానేమి కావాలని మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.ఇక్కడ ఇస్యూ అది కాదు కావాలంటే మీరు కూడా చేసుకోండి మూడు పెళ్లిళ్లు అంటూ అన్న మాటలు పట్టుకొని ఇప్పుడు వైసీపీ వారు రచ్చ లేపేస్తున్నారు.ఇదే అనుకుంటుంటే పవన్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో అతన్ని ఓడించి అక్కడ జనం షాకిచ్చారు.

ఇదే పెద్ద షాక్ అనుకుంటే నిన్న మాట్లాడిన మాటలను పట్టుకొని పవన్ అభిమానే ఒకరు ఫ్లెక్సీ వేయించి మరీ షాకిచ్చిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యిపోతుంది.ఈ ఫొటోలో “నువ్వు చేసుకున్నట్టు మేము మూడు పెళ్లిళ్లు చేసుకోలేము మమ్మల్ని క్షమించు అన్న” అని జనసేన పార్టీ జెండా గుర్తు వేసి గాజువాక జనసైనికుడు శివ ప్రసాద్ అనే పేరు కూడా వేయించారు.ఇప్పుడు ఈ ఫోటో అటు పేస్ బుక్ మరియు ఇటు ట్విట్టర్లలో పెద్ద సంచలనమే రేపుతుంది.ఇది చూసిన కొంతమంది పవన్ అభిమానులు వైసీపీ వారు చేసిన ఎన్నో ఫేక్ ఎడిట్స్ లో ఇది కూడా ఒక కళా ఖండం అని అంటున్నారు.కానీ ఇది మాత్రం చూసేందుకు కాస్త సహజంగానే కనిపిస్తుంది.