బిగ్ బ్రేకింగ్ : జగన్ దెబ్బకు చంద్రబాబుకు మరో మైండ్ బ్లోయింగ్ షాక్..!

Sunday, October 20th, 2019, 01:30:25 PM IST

ఎప్పుడైతే ఏపీ రాజకీయ వర్గాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది.ఇక ఏపీ రాజకీయ వర్గాల్లో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని అంతా అనుకుంటున్నా ఆ పార్టీ నేతలు మాత్రం టీడీపీను బతికించేందుకు గట్టిగా శ్రమిస్తున్నారు.అసలు ఊహించని విధమైన దెబ్బ జగన్ కొట్టినందుకు ఇప్పుడు ఉన్నవారిని కాపాడుకోవడానికి చంద్రబాబుకు టైం సరిపోవడం లేదు.

ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ఇతర పార్టీలలోకి తెలుగు తమ్ముళ్లు జారి వెళ్లిపోతున్నారు.ముందు అంతా బీజేపీలోకి వెళ్లిపోతుండగా ఇప్పుడు వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి.అయితే ఇది మాత్రం చంద్రబాబు కోలుకోలేని విధంగా దెబ్బ పడనుంది అని తెలుస్తుంది.గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి లాక్కున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ 25 మందిలో ఇప్పుడు మొత్తం 15 మంది మళ్ళీ వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి.అయితే వీరు ఇప్పుడు విజయసాయి రెడ్డి తో మంతనాలు జరిపి తిరిగి మళ్ళీ వైసీపీలోకి చేరేందుకు దారి చూపాలని కోరుతున్నట్టు తెలుస్తుంది.అప్పుడు చంద్రబాబు లాక్కున్న వారిలో కీలకమైన నేతలు ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి చేరడం చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకే అని చెప్పాలి.