బిగ్ బ్రేకింగ్ : కెలికి మరోసారి బుక్కయిపోయిన “కత్తి మహేష్”..!

Thursday, February 13th, 2020, 01:49:14 PM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకి తాను అపర మేధావిగా కితాబిచ్చుకునే కత్తి మహేష్ మహేష్ పేరు తెలియని వారు ఉండరు.మొదట ఓ ఛానెల్లో రివ్యూస్ ఇచ్చుకుంటూ సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపు యు టర్న్ తీసుకొని ప్రతీ ఒక్కరినీ కెలుక్కుంటూ పోయి తన స్వేచ్ఛ భావ ప్రకటనను మతాలకు ఆపాదిస్తూ వారి ఆగ్రహాలకు ఓ సారి గట్టిగా దెబ్బ తిన్నాడు.

గతంలో హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామునిపై పలు అనుచిత వ్యాఖ్యలు చేసేసరికి హైదరాబాద్ అవుట్ కట్స్ లో ఎక్కడా కూడా కనిపించకుండా మత పెద్దలు చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకున్నారు.తర్వాత కొన్నాళ్ళు మామూలుగానే ఉన్నా తాజాగా మరోసారి రామునిపై చేసిన కామెంట్స్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండడంతో అవి కాస్త ఓ పక్క రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.

దీనితో హిందూ మత వర్గాలు కత్తి మహేష్ పై మరోసారి తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీంతో హైదరాబాద్ లో మరోసారి అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.శ్రీరామునిపై అవమానకర వ్యాఖ్యలు చేసాడని అవి హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా దానిని సైబర్ క్రైమ్ పోలీసులకు వారు తరలించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెం: 196/2020 యూ/ఎస్ 506,507-IPC సెక్షన్ల కింద కత్తి మహేష్ పై కేసు నమోదు చేసారు.ఇక ముందు అయినా సరే కత్తి తన సుత్తి మాటలను అదుపులో పెట్టుకుంటాడో లేదు చూడాలి.