బిగ్ న్యూస్ : ఏపీలో జగన్ కు షాకివ్వనున్న పిల్లల తల్లిదండ్రులు..!

Thursday, July 30th, 2020, 08:52:59 AM IST

ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలుకు ప్రతీసారి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే హై కోర్ట్ లో 70 సార్లకు పైగా ఎదురు దెబ్బలు పడ్డాయి. అయితే దీనితో పాటుగా ఇటీవలే మాతృ భాషలోనే 5 నుంచి 8 వరకు ఖచ్చితమైన విద్యా బోధన ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉండగా మరోపక్క జగన్ వచ్చే సెప్టెంబర్ 3 నుంచి ఏపీలో పాఠశాలలను తెరవాలని సూచించగా ఈ నిర్ణయానికి ఏపీలోని పిల్లల తల్లిదండ్రులు ఎవరూ ఏకీభవించట్లేదట. వాక్సిన్ వచ్చే వరకు తమ పిల్లలను బడులకు పంపకూడదని వారు నిశ్చయించుకున్నట్టుగా న్యూస్18 వారు చేసిన సర్వే లో తెలింది అని తెలుస్తోంది. దీనితో జగన్ తీసుకున్న మరో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి.