వైసీపీకి మరో షాక్., గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి పిలుపునిచ్చిన బీజేపీ నేత..!

Friday, February 14th, 2020, 09:45:37 PM IST

ఏపీ సీఎం జగన్‌కి మరో షాక్ తగిలినట్టయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశంపై పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసనలు తగులుతున్న సంగతి తెలిసిందే. అయితే రాయలసీమను గ్రేటర్ హైదరాబాద్‌గా ఏర్పాటు చేయాలని బీజేపీనేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.

అయితే తాజాగా గ్రేటర్ రాయలసీమను రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయని గంగుల తేల్చి చెప్పారు. అయితే గ్రేటర్ రాయలసీమ అంశం తాము కేంద్రం దృష్టికి తీసుకువెళతామని, గ్రేటర్ రాయలసీమ సాధించేవరకు పోరాటం చేస్తామని ముందస్తుగా హెచ్చరించారు.