బిగ్ బ్రేకింగ్: జేసీ దివాకర్ రెడ్డికి మరో అల్టీమేట్ షాక్..!

Wednesday, November 20th, 2019, 04:16:25 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్‌కి గట్టి షాక్ తగిలింది. అయితే ఏ విషయంలోనైనా ముందు నుంచి ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి గత కొద్ది రోజుల నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తుంది. ఒక పక్క జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, మరో పక్క వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్స్ బస్సులను వరుసగా సీజ్ చేయడంతో జేసీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆ పరిణామం నుంచి కోలుకొక ముందే మరో ఎదురు దెబ్బ తగిలినట్టయింది. జేసీ బ్రదర్స్ ప్రధాన అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా నేడు వైసీపీలో చేరిపోయారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో గోరాతో పాటు 500 మంది జేసీ అనుచరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ విధి విధానాలు నచ్చే తాము పార్టీలో చేరామని, తమపై ఎలాంటి ఒత్తిళ్ళు లేవని అన్నారు.