మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. దెబ్బ మీద దెబ్బ..!

Thursday, December 5th, 2019, 07:37:20 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి గట్టి షాక్ తగలబోతుంది. అయితే ఏ విషయంలోనైనా ముందు నుంచి ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి గత కొద్ది రోజుల నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తుంది. ఒక పక్క జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, మరో పక్క వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్స్ బస్సులను వరుసగా సీజ్ చేయడంతో జేసీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆ పరిణామం నుంచి కోలుకొక ముందే మరో ఎదురు దెబ్బ తగలబోతుంది. తాడిపత్రిలోని జేసీ కుటుంబానికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎస్‌వీ రవీంద్రారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2003 నుంచి జేసీ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై హత్యాయత్నాలు, దొమ్మిలు, మారణాయుధులు వంటి వాటిలో దాదాపు 11 కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లాలో శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంగా రవిని త్వరలోనే జిల్లా నుంచి బహిష్కరించడానికి పోలీసులు ఆదేశాలు జారీ చేయబోతున్నారట. అయితే ఇదే కనుక జరిగితే ఇప్పటికే రాజకీయంగా జిల్లాలో ఇబ్బందిపడుతున్న జేసీకి ఇది మరో ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.