బిగ్ బ్రేకింగ్ : భీమవరంలో పవన్ కు మరో బిగ్ షాక్..!?

Tuesday, June 4th, 2019, 03:53:08 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అటు భీమవరం మరియు గాజువాకలలో పోటీ చేసి దారుణమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే.ఈ బాధను మర్చిపోయే లోపే పవన్ అభిమానులకు మరో గట్టి షాక్ తగిలింది.అసలే పవన్ ను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థి అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ అక్కడ వందల కోట్లు కుమ్మరించిన సంగతి తెలిసిందే.దానితో పవన్ టఫ్ ఫైట్ మధ్యన ఓటమి పాలయ్యారు.కానీ అదే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో అక్కడ జనసేన పార్టీకు చెందినటువంటి కీలక నేత ఆ పార్టీను వీడి వైసీపీలో చేరినట్టు తెలుస్తుంది.

ఇప్పుడు ఈ వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.ఈయనను పవన్ పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ గా నియమిస్తే ఇప్పుడేమో ఇతను ఇలా పవన్ కు వెన్ను పోటు పొడిచి వైసీపీలో చేరారని సోషల్ మీడియా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా పవన్ ఇలాంటి వారితో ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు భావిస్తున్నారు.ఈ వార్తలో ఎంత వరకు నిజముందో కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.ఇక నుంచి అయినా సరే పవన్ జాగ్రత్తగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.