ఆర్టీసీ కార్మికులకు బిగ్ షాక్.. జీతాల్లేవంటున్న కేసీఆర్ సర్కార్..!

Monday, October 21st, 2019, 05:04:29 PM IST

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తారాస్థాయికి చేరుకుంది. అయితే అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని ఇక తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని త్వరలో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సమ్మెపై వెనక్కి తగ్గని కార్మికులు సమ్మెను మరింత ఉదృత్తం చేశారు. అయితే కార్మికులు సమ్మె చేపట్టడంతో గత నెల జీతాలు కూడా ఇప్పటివరకు కార్మికులకు అందలేదు. అయితే ఈ నెల 21వ తేదీ లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని హైకోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై నేడు హైకోర్ట్‌లో విచారణ జరగగా ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుకు 224 కోట్లు కావాలని అయితే ప్రస్తుతం ఆర్టీసీ కార్పోరేషన్‌లో కేవలం 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ కోర్ట్‌కు తెలిపారు. అయితే దీనిపై మండిపడ్డ కార్మికులు నష్టాల సాకు చెప్పి ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేయాలని ఆలోచిస్తుందని, ఆరేళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని, కావాలనే కోర్ట్‌కు ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తుందని ఆరోపించారు. కాగా ఈ కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.