టీఆర్ఎస్‌కి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి..!

Saturday, January 11th, 2020, 10:40:19 PM IST

తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఎన్నికలలో టికెట్ రాని నేతలంతా రెబల్స్‌గా పోటీ చేస్తుండడం, కొందరు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో టీఆర్ఎస్ నేతలకు గుబులు పుట్టుకుంది.

అయితే తాజాగా టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దివంగత నేత వెంకట స్వామి కుమారులైన వివేక్, వినోద్ 2013లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే తిరిగి 2014లో కాంగ్రెస్‌లో చేరిన వీరు మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ చెంతకే చేరారు. అయితే వీరిద్దరికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో కానీ, 2019 పార్లమెంట్ ఎన్నికలలో కానీ టికెట్లు దక్కకపోవడంతో వివేక్ బీజేపీలో చేరిపోయారు. అయితే తాజగా నేడు టీఆర్ఎస్‌కి గుడ్‌బై చెప్పి మాజీ మంత్రి వినోద్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.