బాబోయ్ .. ఎన్టీఆర్ జీవితకథ తో మరో సినిమానా ?

Wednesday, October 25th, 2017, 11:36:46 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తి రేపుతున్న విషయం ఒక్కటే .. అదే మహా నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ? ఇప్పటికే అయన తనయుడు నందమూరి బాలకృష్ణ, తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతొ .. మరో సంచలన చిత్రానికి తెర లేపాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తి కార చర్చ సాగుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ తో మరో సినిమా రూపొందించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ? ఇందులో సీనియర్ నటి వాణి విశ్వనాధ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పాడు. అప్పట్లో పలు చిత్రాలను నిర్మించిన జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు. మరి ఒకేసారి మూడు సినిమాలు రావడం నిజంగా సంచలనం అని చెప్పాలి. ఈ సినిమాలు విడుదలైతే ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి!!

  •  
  •  
  •  
  •  

Comments