సీఎం కెసిఆర్ కి మరొక దెబ్బ – నేటి నుండి క్యాబ్స్ కూడా బంద్

Friday, October 18th, 2019, 03:00:09 AM IST

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సతమతమవుతున్నటువంటి సీఎం కెసిఆర్ కి తాజాగా మరొక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. కాగా ఈనెల 19 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాఫంగా ఉన్నటువంటి దాదాపు యాభైవేల మంది క్యాబ్ డ్రైవర్లు కూడా రాష్ట్రంలో తీవ్రమైన సమ్మె చేయడానికి పూనుకున్నారు. అయితే తమ సమస్యల పరిష్కారం కోసం గత ఆగష్టు 30 న ప్రభుత్వానికి లేఖ అందించగా కనీసం 2 నెలల తరువాత కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయాన్ని తెలంగాణా టాక్సీ డ్రైవర్ల జేయేసీ అధికారికంగా ప్రకటించింది.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు వీరు కూడా సమ్మె చేస్తే ప్రయ్నకులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె కు తెలంగాణ ఉద్యోగులందరూ కూడా మద్దతు తెలిపారు. కాగా ఇప్పుడు క్యాబ్స్ డ్రైవర్ల సమ్మె కు కూడా అందరు ఒక్కటవుతారని, ఇలాంటి సమయంలో కెసిఆర్ ఏం చేస్తారని అందరు కూడా చర్చల్లో మునిగిపోయారు. ఇదంతా కూడా చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడేలాగే ఉందని సమాచారం.