సినిమాలో చాన్సు ఇవ్వమంటే నైటీ వేస్కొని రమ్మన్నారు

Thursday, May 3rd, 2018, 06:37:36 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ – బాలీవుడ్…ఇలా దాదాపుగా ప్రతి ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన….బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కామెంట్స్….పై చర్చోపచర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బీబీసీ…ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. బాలీవుడ్ కు చెందిన రాధికా ఆప్టే వంటి పలువురు హీరోయిన్లు…తమ చేదు అనుభవాలను ఆ డాక్యుమెంటరీలో వివరించారు. తాజాగా మరో బాలీవుడ్ నటి మహి గిల్…క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పడుకుంటేనే అవకాశాలిస్తామని తనను వేధించారని – ఇండస్ట్రీలో చాలామంది ఇడియట్స్ ఉన్నారని మహి షాకింగ్ కామెంట్స్ చేసింది. సల్వార్ కమీజ్ వేసుకొని వెళితే…నైటీలో రమ్మని కొందరు డైరెక్టర్లు అడిగేవారని…సంచలన ఆరోపణలు చేసింది.

దేవ్ డీ – దబంగ్ – సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ వంటి చిత్రాలతో మహి గిల్ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. కుండ బద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా మాట్లాడుతుందని గిల్ కు పేరుంది. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలని ఆమె ఓ మీడియా చానెల్ తో పంచుకుంది. ముంబై తనకు కొత్త అని ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఇండస్ట్రీలో ఎవరు మంచి వాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో తెలుసుకోవడం కష్టంగా ఉండేదని తెలిపింది. అవకాశాల కోసం వెళితే….ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారని – భయమేసి అక్కడి నుంచి పారిపోయిన సందర్భాలున్నాయని చెప్పింది. తనను వేధించిన డైరెక్టర్ల పేర్లు గుర్తుకు లేవని ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇడియట్స్ అని చెప్పింది. సల్వార్ సూట్ వేసుకొని ఓ డైరెక్టర్ ను కలిశానని – ఇలా వస్తే ఎవరూ అవకాశాలివ్వరు….అన్నాడని గుర్తు చేసుకుంది. ఇలా సల్వార్ కమీజ్ లో వస్తే ఏం తెలుస్తుందని…నైటీలో రావాలని మరో డైరెక్టర్ అన్నాడని చెప్పింది. అప్పటి నుంచి తాను అవకాశాల కోసం ఆఫీసులుకు వెళ్లడం మానేశానని – బయట పబ్లిక్ ప్లేసుల్లో తన మిత్రులను వెంటబెట్టుకొని కలిసేదాన్నని తెలిపింది. మొదట్లో అవకాశాలు లేక తిండికి డబ్బులు లేని రోజులు కూడా ఉన్నాయని దూరదర్శన్ సీరియల్స్ లో నటించి రోజులు గడుపుకున్నానని చెప్పింది. దేవ్ డీ సినిమాతో బ్రేక్ వచ్చిందని – ప్రస్తుతం సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ 3 చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments