ప్రభాస్ సరసన మరో హీరోయిన్ ?

Thursday, April 19th, 2018, 01:22:34 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లోని పలు ఖరీదైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ ని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ రెండో హీరోయిన్ ఎవరో తెలుసా .. మరో బాలీవుడ్ భామ ఎవలిన్ శర్మ ? ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన మీదట ఎవ్లీన్ ని ఖరారు చేసారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments