టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు..!

Wednesday, May 12th, 2021, 03:00:21 AM IST

Chandrababu-Naidu

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదయ్యింది. కొత్త స్ట్రెయిన్ అంటూ ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. అయితే న్యాయవాది అనిల్ ఫిర్యాదు మేరకు చంద్రబాబు నాయుడిపై 188, 505(1)బి, 505(2) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే ఏపీలోని కర్నూలులో ఎన్440కే అనే కొత్త కరోనా స్ట్రెయిన్ గుర్తించారని, ఇది మరింత ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది సుబ్బయ్య అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 155, 505/1/బి/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిలబుల్ కేసు కూడా నమోదు చేసి నోటీసులు కూడా ఇస్తామని అంటున్నారు.