తెలంగాణలో మరో కరోనా మరణం.. మొత్తం 7కి చేరిన సంఖ్య!

Thursday, April 2nd, 2020, 01:00:29 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు వందకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉండగా నేడు మరో మరణం నమోదయ్యింది.

ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బారిన పడి ఆరు మంది చనిపోగా నేడు మరో మరణం నమోదయ్యింది. అయితే ఇప్పటివరకు చనిపోయిన వారంతా ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్ధనలకే హాజరైన వారు కావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. అయితే ఇదిలా ఉంటే సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేక అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు డాక్టర్లపై డాక్టర్లపై దాడి చేశాడని తెలుస్తుంది. కరోనా రోగులకు పెద్దమనసుతో వైద్యం చేస్తున్న డాక్టర్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.