విజయవాడ లో మరో కరోనా అనుమానిత కేసు

Sunday, March 22nd, 2020, 10:09:48 PM IST

కరోనా వైరస్ ప్రభావం అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విజయవాడ నగరం లో సింగ్ నగర్ లో కరోనా అనుమానిత కేసు నమోదు అయింది. 20 రోజుల క్రితం ఢిల్లీ నుండి ఒక వ్యక్తి విజయవాడ చేరుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉండటంతో స్థానికులు, మీడియా సహకారం తో అప్రమత్తం అయ్యారు. అయితే అక్కడి స్థానికులు సమాచారం మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

కరోనా వైరస్ ను నివారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఇంటికి సర్వే చేయించడం, కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఇంట్లోనే ఇసొలేషన్ లో పెట్టడం, అవసరమైన వారిని మాత్రమే ఆసుపత్రికి తరలించడం, అంతేకాకుండా విదేశాల నుండి వచ్చిన వారిపై పర్యవేక్షణ మరియు పలు రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అయితే ఈ మొత్తం తతంగానికి గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ గట్టిగానే పనిచేయనుంది.