హై అలెర్ట్ : భారత్ లో మరొక కరోనా మరణం – మొత్తం 14…?

Thursday, March 26th, 2020, 01:24:54 PM IST

గత కొంత కాలంగా భారత్ లో కూడా భయంకరమైన కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో, భారత్ లో రోజు రోజుకి కరోనా వైరస్ బాధితుల మరణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. కాగా తాజాగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఈ కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా వివరాల్లోకి వెళ్తే… ఈ కరోనా వైరస్ సోకిన కారణంగా గుజరాత్ రాష్ట్రంలో ఒక 70 ఏళ్ళ వ్యక్తి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వైరస్ మరింతగా విజృంభించిన కారణంగా నేడు ఆ 70 ఏళ్ళ వ్యక్తి మరణించాడని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించగా, వైద్యాధికారులు అతడి మరణాన్ని ధ్రువీకరించారు.

అయితే ఈ తాజా మరణంతో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సూరత్, అహ్మదాబాద్,భావనగర్ ప్రాంతాల్లో కరోనా వైరస్ బాధితులమరణాల సంఖ్య మూడు కి చేరుకోగా, దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల మారణాల సంఖ్య 14 కి చేరుకుంది. అంతేకాకుండా గుజరాత్ లో ఇప్పటికే 43 కరోనా పాసిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించారు. ఇకపోతే దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, వారి మరనాల సంఖ్య మరింతగా పెరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.