విశాఖలో మరో ప్రమాదం.. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..!

Tuesday, July 14th, 2020, 07:29:29 AM IST

ఏపీ పరిపాలన రాజధాని విశాఖను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్‌లు సృష్టించిన తీవ్రత నుంచి కోలుకోకముందే నిన్న రాత్రి విశాఖను మరో పారిశ్రామిక ప్రమాదం చుట్టుముట్టింది.

అయితే విశాఖ పరవాడలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక శకటాలు కూడా సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే అదే సమయంలో వర్షం ప్రారంభమవ్వడంతో మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి.
ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఏదేమైనా వరుస ఘటనలు జరుగుతుండడంతో విశాఖ వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.