అక్కడ 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి..!

Wednesday, March 25th, 2020, 08:20:13 PM IST

చైనాలో పుట్టిన వైరస్ ప్రపంచ దేశాలకు సైతం పాకింది. భారత్ లో సైతం కరోనా వైరస్ మెల్లి మెల్లిగా వ్యాప్తి చెందుతుంది. అయితే వైరస్ కేసులు అధికం అవుతుండటం తో డిల్లీ ప్రభుత్వం మూడు రోజుల క్రిందట లాక్ డౌన్ ప్రకటించేసింది. రవాణా సౌకర్యాలు సైతం లేక ప్రజా వ్యవస్థ స్తంభించి పోయింది. అయితే నిన్నటివరకు పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కాలేదు. కాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అయిదు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి అని అన్నారు.అయితే నిన్న సాయంత్రం వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం కేసులు నమోదు అవ్వడం పట్ల డిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అయితే ఇప్పటికే 30 మందికి కరోనా పాజిటివ్ సోకగా అందులో కొంతమంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.