బ్రేకింగ్ : ఏపీలో మరో చోట గ్యాస్ లీక్..ఒకరు మృతి!

Saturday, June 27th, 2020, 01:20:26 PM IST

గత కొన్ని వారాల కితం ఆంధ్ర రాష్ట్రం విశాఖ జిల్లాలో ఎల్ జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టెరిన్ గ్యాస్ వలన ఎంతటి పెను ప్రమాదం జరిగిందో తెలిసిందే. ఈ విషాద ఘటన దేశం మొత్తం సంచలనం రేపింది.

ఇప్పటి వరకు కూడా దాని ప్రభావం అక్కడ ఇంకా ఉంది. దీని తర్వాత మళ్ళీ పలు చోట్ల అలాంటి ఉందంతాలే చోటు చేసుకోవడంతో మరింత కలకలం రేగింది. ఇవే అనుకుంటే ఇప్పుడు ఏపీలో మరో చోట గ్యాస్ లీక్ కలకలం రేగింది.

కర్నూల్ జిల్లా నంద్యాల ఎస్ పి వై రెడ్డి ఫ్యాక్టరీ లో ప్రమాదకర అమోనియా గ్యాస్ లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో ఘటన స్థలి లో ఉన్న ఒక వ్యక్తి మరణించగా మరికొంత మంది తీవ్ర అస్వస్థకు లోనయినట్టుగా తెలుస్తుంది. ఆ ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరం.