ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్..!

Tuesday, October 15th, 2019, 12:43:07 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే గ్రామ వాలంటీర్ల పేరుతో లక్షలాది ఉద్యోగాలు కల్పించి ఏపీలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాడు.

అయితే ముందుగానే ప్రతి జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంటుందని చెప్పిన సీఎం జగన్, తాజాగా వివిధ శాఖలలో ఖాళీలుగా ఉన్న మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. శాఖల వారిగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అందించాలని అయా శాఖల అధికారులతో పీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నేడు భేటీ అయ్యారు. అయితే ఆయా శాఖలలో వచ్చిన సమాచారం ప్రకారం త్వరలోనే వాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అన్నారు. అయితే ఈ పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారానే జరుపుతామని ప్రకటించింది.