సీఎం జగన్ కి మరొక గుడ్ న్యూస్ – పీపీఏల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న న్యాయస్థానం

Thursday, October 17th, 2019, 03:00:06 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీని నమోదు చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన విషయంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా కృషి చేస్తున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడనికి ఆర్థిక భారాన్ని బాగా తగ్గిస్తున్నారు సీఎం జగన్. కాగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో కొందరు ఏఖీభవిస్తున్నప్పటికీ కూడా మరికొందరు మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నారు. పక్కాగా చెప్పాలంటే ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ విషయంలో చాలా మొండిపట్టుదల చూపిస్తుందని సమాచారం.

అయితే ఇలాంటి సమయంలో సీఎం జగన్ కు ఒక శుభవార్త వినిపించింది. కాగా పీపీఏల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్నటువంటి మొండిపట్టుదలకు హైకోర్టు ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పునః సమీక్షకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో, కేంద్రంలో తీవ్రమైన విమర్శకత ఏర్పడింది. అయితే తాజాగా ఈ విషయంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సీఎం జగన్ ప్రభుత్వానికి అభ్యన్తరాలతో కూడిన ఒక లేఖను రాసింది. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏస్సీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈక్రమంలో న్యాయస్థానం సీఎం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏపీలో ప్రస్తుతానికి ఆర్థిక సంక్షోబం ఉందని, తమ అనుకూలతను బట్టి నిధులు చెల్లిస్తామని చూపిన ఏపీ ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తూ, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అడ్డుకట్ట వేయొద్దని కేంద్రాన్ని ఆదేశించింది న్యాయస్థానం.