మరొక శుభవార్త చెప్పిన సీఎం జగన్ – ప్రజల పాలిట దైవంగా జగన్

Saturday, October 19th, 2019, 01:15:05 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని నమోదు చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సొంతం చేసుకున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ, ఎన్నో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలందరి ప్రశంసలను పొందుతున్నారు. కాగా ఈమేరకు సీఎం జగన్ తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే ఆరోగ్య శ్రీ పథకం… అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి కొన్ని కొత్త హంగులు జోడించి, ఈ పథకం ద్వారా ప్రజలందరికి మరింతగా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.

ఇప్పటివరకైతే ఈ పథకం ద్వారా ఇక్కడి ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైద్యం చేయించుకోగలరు. కానీ సీఎం జగన్ కాస్త ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ పరిధిని పెంచారు. ఈమేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 150 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోడానికి వెసులుబాటు కల్పించబోతున్నారు. అయితే ఈ కొత్త పథకం నవంబర్ 1 నుంచి అమలు అవనుంది అని సీఎం జగన్ అధికారికంగా ప్రకటించారు.