మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా మరో కళ్యాణ్ బాబు

Saturday, September 23rd, 2017, 04:40:07 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రిలో ఒకే కుటుంబానికి చెందిన హీరోలు చాలామంది ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు సొంతంగా స్థాయిని ఏర్పరచుకున్నారు. మంచి టాలెంట్ ని కనబరుస్తూ.. టాలివుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఉన్నారు. అంతే కాకుండా మరొకొందరు యువకులు రానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిన్న కుమార్తె భర్త కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. గత ఏడాది శ్రీజని ఘనంగా పెళ్లి చేసుకున్న కళ్యాణ్ వ్యాపారవేత్త. బిజినెస్ వ్యవహారాల్లో అతని రేంజ్ చాలా పెద్దది.

అయితే చూడగానే హీరో లుక్స్ కనిపించాయి. అందగాడు కూడా. మరి మెగాస్టార్ అల్లుడు ఒక్కసారైనా తెరపై కనిపించలేడా?.. అన్న ప్రశ్నకు త్వరలోనే పులిస్టాప్ పడనుంది. ఎందుకంటే కళ్యాణ్ ప్రముఖ రచయిత సత్యానంద్ దగ్గర నటనపై శిక్షనను తీసుకుంటున్నడని జోరుగా ప్రచారం జరుగుతోంది. సత్యానంద్ పవన్ కళ్యాన్ – మహేష్ వంటి వారికీ శిక్షణను ఇచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ యువ హీరోలకు కూడా ఆయనే గురువు దీంతో కళ్యాణ్ కూడా ఎంతో శ్రద్దగా నటనలో శిక్షణను తీసుకుంటున్నడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఒకవేళ వస్తే మెగా అల్లుడు ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments