ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం – ఈసారి మంగళగిరి టార్గెట్…?

Wednesday, December 11th, 2019, 11:04:12 PM IST

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండి ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా మంగళగిరి నియోజక వర్గం పై ద్రుష్టి సారించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాష్ట్ర్ర రాజకీయాల్లో మంగళగిరిని ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకోవచ్చు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చాలా దారుణంగా ఓడిపోయిన స్థానంలో, మరింతగా తన బలాన్ని పెంచుకోడానికి అధికార వైసీపీ పార్టీ తీవ్రమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ మేరకు మంగళగిరి నియోజక వర్గ మున్సిపాలిటీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి.,

అయితే తమపై గెలిచిన వైసీపీ పార్టీ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలనే కోపంతో రగిలిపోతున్నటువంటి టీడీపీ, ఇటీవలే మంగళగిరిలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకుంది. అయితే ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మరొక ముందడుగు వేస్తూ, మంగళగిరి మున్సిపాలిటీ పరిధి పెంచేసింది. ఈమేరకు బుధవారం నాడు సంబంధిత ఉత్తర్వులను అధికారికంగా జారీ చేసింది. అంతేకాకుండా ఇన్నిరోజులు కూడా సెకండ్ గ్రేడ్ కింద ఉన్నటువంటి మంగళగిరి మున్సిపాలిటీని ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ పరిధికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.