బ్రేకింగ్ : టీడీపీకి బిగ్ షాక్ మరో పెద్ద తల ఒక్క పోస్ట్ తో గుడ్ బై..?

Thursday, June 6th, 2019, 02:45:24 PM IST

గడిచిన ఎన్నికల ఫలితాలతోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీ లో అధోగతి పాలయ్యినట్టు అనిపిస్తుండగా అదే పార్టీకి చెందిన కీలక నేతలు ఇదే గ్యాప్ లో చంద్రబాబుకు ఊహించని షాకిస్తున్నారు.తాజాగా తెలుగుదేశం పార్టీకు చెందినటువంటి కీలక నేత అయిన కేశినేని నాని విషయంలో గత రెండు రోజులు నుంచి టీడీపీ అధిష్ఠానానికి మరియు అతనికి చిన్న కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనితో కేశినేని నాని ఆ పార్టీను వీడుతున్నారు అంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి.చంద్రబాబుతో చర్చలు జరిపినా సరే నాని తనకి ఇచ్చిన పదవి వద్దని బాబుతో తేల్చి చెప్పేసారు.దీనితో చంద్రబాబు జరిపిన మంతనాలు పూర్తిగా విఫలం అయ్యాయి.

ఇదిలా ఉండగా కేశినేని నాని మాత్రం తన పేస్ బుక్ అకౌంట్ ద్వారా తన ఆవేదనను వ్యతిరేకతను చూపించడం మానలేకపోతున్నారు.తాజాగా పెట్టిన ఒక్క పోస్టుతో ఆయన ఇక తెలుగుదేశం పార్టీలో ఎంతో కాలం కొనసాగరని అర్ధమవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.ఆయన తన పేస్ బుక్ ద్వారా మహాకవి శ్రీశ్రీ చెప్పిన “పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప” అంటూ పెట్టారు.అంతే ఈ ఒక్క పోస్టుతో ఇక క్లారిటీ వచ్చింది అని ఆయన ఆ పార్టీని వీడడం ఖాయమని చాలా మంది నిర్ధారించేస్తున్నారు.మరి కేశినేని నాని ఇదే మాటలను నిజంగా ఆచరణలో చేసి చూపుతారో లేదో చూడాలి.ఒకవేళ కానీ నిజంగా తప్పుకున్నట్టయితే అది తెలుగుదేశం పార్టీకు పెద్ద షాకే అని చెప్పాలి.