బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న మరో ఊహించని నేత.!?

Saturday, June 8th, 2019, 08:06:41 PM IST

ఇప్పుడు వైసీపీ అధినేత మరియు ఆంధ్ర రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన కార్యాచరణపై పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.అందులో భాగంగానే గత కొన్ని రోజులు నుంచి జగన్ క్యాబినెట్ లో ఉండే మంత్రుల విషయంలో కూడా అసలు సస్పెన్సుకు ఈ రోజే తెర దించి ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలో కూడా నిశ్చయించేసారు.ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు మరియు వైసీపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ కొద్ది లోనే వార్తలు కూడా బయటకు వచ్చాయి.ఇప్పుడు మళ్ళీ ఆ కొందరి జాబితాలోనే మరో కీలక నేత కూడా చేరబోతున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓ వార్త ఊపందుకుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన రావెల కిషోర్ బాబు జనసేన లో చేరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిగ్ షాకిచ్చారు.ఇదే క్రమంలో రానున్న రోజుల్లో జనసేన పార్టీలోనే కొనసాగినట్టయితే తనకి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుంది అని అంచనాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా లేకపోవడం అలాగే దళితులకు వైసీపీలో పెద్ద పీట వెయ్యడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.మరి ఆయన ఆ పార్టీలోకి చేరుతారా లేదా అన్నది చూడాలి.