మాజీ ముఖ్యమంత్రికి మరొక పదవి…? ఎవరికో తెలుసా…?

Thursday, November 21st, 2019, 09:37:28 PM IST

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కొన్ని కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా తరువాత ఆ పదవి ఎవరికీ దక్కుతుందనే విషయం గత కొద్దీ రోజులుగా చర్చనీయాంశంగా మారింది అని చెప్పాలి. కాగా ఆ పదవి ఇక మాజీ ముఖ్యమంత్రి కి దక్కుతుందని వార్తలు వస్తున్నాయి.. కాగా రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన అందులో ఎలాంటి పదవిని కూడా ఆశించలేదు.

ఇకపోతే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తరువాత ఆయన బీజేపీ లోకి వెళ్తాడనే ప్రచారం కూడా బాగానే జరిగింది. కానీ అవన్నీ కూడా పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ పార్టీలో కీలకంగా మారనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈమేరకు కిరణ్‌కుమార్‌రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు కూడా వచ్చిందని సమాచారం. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి తో కిరణ్ ఫోనులో మాట్లాడారని, ఆయనను ఢిల్లీకి రావాల్సింది గా కోరారని సమాచారం. అయితే ఈమేరకు కిరణ్ కుమార్ రెడ్డి ని ఏపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నియమించాలని చూస్తుందని సమాచారం. అయితే ఈ పదవికి కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.