టాలీవుడ్ కి మరొక మెగా వారసుడు!

Friday, May 4th, 2018, 09:01:42 PM IST


మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆయన తదనంతరం ఆయన కుటుంబంలో మొదటి సోదరుడు నాగబాబు నటనపరంగా మంచి మార్కులు సంపాదించినా ఆయనకు ఎక్కువ క్యారెక్టర్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఇక రెండవ సోదరుడు పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే పవర్ స్టార్ గా ఎంత ఎత్తుకి ఎదిగారో చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత ఆయన కుమారుడు రామ్ చరణ్ తండ్రిని తగ్గ తనయుడు అని నిరూపించుకుంటున్నారు. ఇక ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన టాలెంట్ లో దూసుకుపోతుండగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా మంచి చిత్రాలు చేస్తూ మెగా ఫామిలీ ఇమేజ్ ని మరింత పెంచుతున్నాడు.

ఇక పోతే ఇటీవల మెగా స్టార్ చిన్న కుమార్తె శ్రీజ, భర్త అయిన కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభం అయింది. ఆ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ప్రస్తుతం మరొక మెగా వారసుడు టాలీవుడ్ కు అరంగేట్రం చేయబోతున్నాడు. అతడు మరెవరో కాదు మెగా స్టార మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. అన్న సాయి ధరమ్ లానే నటనలో శిక్షణ తీసుకున్న వైష్ణవ్ సాయికొర్రపాటి నిర్మాణంలో, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రంలో నటించనున్నాడని, ఇప్పటికే ఈ విషయమై కథాచర్చలు పూర్తిఅయ్యాయని, త్వరలోనే ఈ చిత్రమ్ లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం…..

Comments