బిగ్ న్యూస్: ఏపీలో మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్..!

Friday, July 3rd, 2020, 02:52:50 AM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల చాలా మంది రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, వారి ఇంట్లో పని మనిషికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం.