ఏపీ లో మరో ఎమ్మెల్యే కి సోకిన కరోనా..!

Thursday, July 2nd, 2020, 12:16:38 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా అవుతునే ఉంది కానీ, ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజా గా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే శృంగవరపుకోట, కోడుమూరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ భారిన పడగా, తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ తేలడం తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే తో పాటుగా, గన్ మెన్ మరియు ఇద్దరు కుటుంబ సభ్యులకి సైతం కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది.

అయితే ఎమ్మెల్యే తో సన్నిహితంగా మెలిగిన మిగతా 16 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన వారిని స్వీయ నిర్బంధం లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.అయితే రాష్ట్రంలో సైతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగుతున్నాయి. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే కి కరోనా వైరస్ పాజిటివ్ తేలడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు.