వీడియో సాంగ్ : ‘ఉరిమే మెరిసే’ అంటూ పాడిన రాక్ స్టార్ నాని..

Friday, March 16th, 2018, 01:10:54 PM IST

హీరో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మరో తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మిర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మీజా సంగీతం సంగీత దర్శకులుగా వహిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ని విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మూడో పాట‌ని విడుద‌ల చేసింది. ‘ఉరిమే మనసే’.. అంటూ సాగే ఈ విరహగీతం సంగీత ప్రియుల‌ని ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌ను రఘు దీక్షిత్ ఆలపించగా.. శ్రీజో ఈ పాటను రాసారు. ఈ పాట‌లో నాని రాక్‌స్టార్‌గా అర్జున్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. సినిమాలోని మొదటి పాట‌గా విడుద‌లైన దారి చూడు దమ్మూ చూడు మామ.. అనే పాట‌కి సినీ అభిమానుల్లో భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట పెంచ‌ల్ దాస్ పాడారు. ‘నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరస.. ఐ వన ఫై.. వన ఫై..’ అనే ప్రేమ గీతంకి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నాని డ్యూయ‌ల్ రోల్ పోషిస్తుండ‌గా, కృష్ణ పాత్ర‌లో ఊర‌మాస్‌గా క‌నిపించ‌నున్న నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా అల‌రించ‌నున్నాడు. మ‌రి తాజాగా విడుద‌లైన ఉరిమే మ‌న‌సే.. సాంగ్‌పై మీరూ ఓ కన్నేయండి..