తెలంగాణాలో మరొక కొత్త శాఖ – పేరు “భూమాత”

Friday, August 23rd, 2019, 02:29:09 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు… తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్న తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్నోకీలకమైన నిర్ణయాలు తినుకుంటు దూసుకుపోతున్నాడు… కాగా తాజాగా కెసిఆర్ మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా గత కొంత కాలంగా చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న రెవిన్యూ శాఖలో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో సమావేశమైన కెసిఆర్ రెవిన్యూ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దే ఆలోచనలు అందరిని అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబందించిన పనులను కూడా మొదలెట్టేశారు అధికారులు…

అంతేకాకుండా రెవిన్యూ శాఖ అంటే భూములకు సంబందించిన విషయాలు ఎక్కువగా ఉండటం వలన ఆ శాఖ పేరు మర్చి, దానికి భూమాత శాఖగా పేరు మార్చాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారంట. దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ శాఖలో కొత్తగా మార్పులు చేశాక ఇక గతంలో మాదిరిగా ఇబ్బందులు లేకుండా రైతులు మరియు అన్ని వర్గాల వారికి సంబంధిత సేవలన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయని సమాచారం.