తెలంగాణంలో మరో కరోనా పాజిటివ్ కేసు.. 45కి చేరిన కేసులు..!

Thursday, March 26th, 2020, 11:30:03 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. నేడు ఉదయం వరకు 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయ్యింది.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 45 కి చేరుకుంది. అయితే తాజాగా సికింద్రాబాద్‌లోని బౌద్ధ నగర్‌కి చెందిన 43 ఏళ్ళ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ ఒక్క రోకే 4 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలను చేపట్టబోతుంది.