దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. పోలీసులపై మరో పిటీషన్..!

Wednesday, December 11th, 2019, 02:01:02 AM IST

దిశ హత్య కేసుకు సంబంధించి నలుగురు నింధితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపిన సంగతి తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను దిశను చంపిన సంఘటన స్థలం చటాన్‌పల్లి వద్దకు తీసుకుని వెళ్ళగా వారు పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై దేశమంతా హర్షం వ్యక్తం చేసినా, కొందరు మాత్రం పోలీసుల తీరును తప్పుపట్టారు. నిందితులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడాలి కానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎన్‌కౌంటర్ పేరుతో చంపడం తప్పేనని అంటున్నారు.

అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమీషన్ పోలీసులపై సీరియస్‌గా ఉంది. అయితే దీనికి సంబంధించి హైకోర్ట్‌లో మరో పిటీషన్ దాఖలైంది. ఇందులో 9 మంది వ్యక్తులను ప్రతివాదులుగా చేరుస్తూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, సీపీ సజ్జనార్, మహేష్ భగవత్‌లను ప్రతివాదులుగా చేర్చగా ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.