బిగ్ అప్డేట్ : నిర్భయ నిందితుల విషయంలో న్యాయస్థానానికి మరొక పిటిషన్…

Saturday, December 14th, 2019, 02:08:48 AM IST

ఢిల్లీలో గతంలో జరిగినటువంటి నిర్భయ హత్యోదంతం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కాగా గత ఏడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిర్భయ హత్య కేసులో నిందితులను మరికొద్ది రోజులూ ఉరి తీస్తామని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈమేరకు 10 ఉరి తాళ్లను సిద్ధం చేయాలని, తలారిని కూడా సిదంగా ఉంచాలని సంబంధిత అధికారులు ఇప్పటికే బాక్సర్ జైలుకు లేఖ కూడా రాసారు. అయితే ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల చివరికల్లా ఏ నలుగురు నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈమేరకు న్యాయస్థానానికి మరొక పిటిషన్ రాశారు. ”నిర్భయ దోషులు దాఖలు చేసిన రివ్యూ, క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లన్నంటికీ తిరస్కరించాలి. వీలైనంత త్వరగా డెత్ వారంట్ జారీ చేసి నెల లోపే నలుగురు దోషులను ఉరితీయాలి. ఉరి తీయడాన్ని టీవీల్లో టెలికాస్ట్ చేసి దేశ ప్రజలందరికీ చూపించాలి. అమెరికా తరహాలో నిర్భయ తల్లిదండ్రులను తీహార్ జైలుకు తీసుకెళ్లి వారి ముందే దోషులను చంపేయాలి” అని తమ పిటిషన్లో పేర్కొన్నారు.