షాకింగ్ : జనసేనపై మరో భారీ కుట్రకు తెర లేచిందా.?

Thursday, July 11th, 2019, 05:40:46 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు.ఇతర పార్టీల అసత్య ప్రచారాలు ఎదుర్కొని వాటి నుంచి బయటపడలేక గట్టి దెబ్బే తిన్నారు.దానితో జనసేన శ్రేణులకు కూడా కొన్నాళ్ళు బాధ పడ్డా మళ్ళీ వెంటనే తమ తమ పనుల్లో నిమగ్నం అవ్వగా పవన్ కూడా కొత్త ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి వేచి చూద్దామని తెలియజేసారు.ఇదిలా ఉండగా మళ్ళీ జనసేనపై మరో సరికొత్త కుట్ర జరుగనుందా అని రాజకీయ వర్గాల్లో ఒక వార్త ఊపందుకుంది.

తాజాగా కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు రాసిన ఒక లేఖ సంచలనం రేపగా అందులో మా పార్టీను కాదని మీకు ఓటేశామని చెప్పడం ఒక సరికొత్త అనుమానాన్ని రేకెత్తిస్తుంది అని జనసేన శ్రేణులు అంటున్నారు.జనసేన అన్ని కులాలకు అతీతంగా పని చేసిందని కానీ ఈయన ఇప్పుడు మా పార్టీ అని చెప్పి దానికి మద్దతుగా నిలవక పోగా జనసేన పార్టీ అనేది ఒక కులానికి చెందిన పార్టీగా ముద్ర వేసేందుకు కుట్ర పన్నుతున్నారా అని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.

అయితే జనసేన పార్టీను ఇలా ఒకే కులానికి చెందిన పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా చేసి ఉండొచ్చనే మరో వాదన కూడా వినిపిస్తుంది.ఎప్పటి నుంచో రెండు కులాలు మాత్రమే ఏలుతున్న ఆంద్ర రాష్ట్రంలో మూడో ప్రత్నామ్యాయంగా వచ్చే వారికి కులం అంతగట్టేస్తారు కానీ ఆ పార్టీలకు మాత్రం ఎలాంటి కులాన్ని ఆపాదించారు అదేంటో అంటూ సామాన్య ప్రజలు అంటున్నారు.