మంత్రి కొడాలి నానిపై మరో కేసు.. క్షమాపణ చెప్పాల్సిందే..!

Wednesday, November 20th, 2019, 04:37:42 PM IST

ఏపీ మంత్రి కొడాలి నానికి మరోసారి చుక్కెదురయ్యింది. తిరుమల ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలిపై విజయవాడలో మరో కేసు నమోదయ్యింది. ఈ విషయంపై ఇటీవలే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి కొడాలి నానిపై తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొడాలి నానిపై బ్రహ్మాణ సంఘాల నేత వేమూరి ఆనంద సూర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవాలయల్ని కించపరిచే విధంగా ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని, ఒక మంత్రి స్థానంలో ఉండి కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని దీనికి కొడాలి నాని తిరుమల శ్రీవారి పాదాల మీద పడి హిందూ జాతికి క్షమాపణ చెప్పాలని ఏపీలో బ్రహ్మాణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై మంత్రి కొడాలి నానిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.