కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచిన మరో తెలంగాణ పోలీస్ అధికారి..!

Monday, June 22nd, 2020, 09:26:25 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ నియంత్రణకై విధించిన లాక్‌డౌన్‌ని పక్కాగా అమలు చేసిన పోలీసులను కూడా కరోనా వెంటాడుతుంది.

అయితే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే తెలంగాణ పోలీసు శాఖలో ఓ కానిస్టేబుల్ మృతిచెందగా తాజాగా నేడు మరో పోలీస్ అధికారి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో వారం రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ అని తేలగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచాడు. 47 సంవత్సరాలు ఉన్న యూసుఫ్ 20 రోజుల క్రితమే కాలాపత్తర్ పీఎస్‌లో ఏఎస్ఐగా చేరారు.