మహిళా దినోత్సవం సందర్భంగా వకీల్ సాబ్ నుండి మరొక పోస్టర్ విడుదల

Monday, March 8th, 2021, 03:56:44 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పాస్టర్ ను విడుదల చేసింది. నివేథా థామస్, అంజలి, అనన్య లతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ ను ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన విడుదల కానుంది. దిల్ రాజు, బోని కపూర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో లాయర్ గా నటిస్తున్నారు.